రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 24మంది మృతి
- February 26, 2020
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 24 మంది చనిపోయారు. బూండీలోని కోట లాల్‌సాత్ మెగా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకల కోసం వరుడి కుటుంబం, బంధువులతో కలిసి.. కోట నుంచి సవాయ్‌మాధోపూర్ వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ నదిలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. ఇప్పటివరకు 24 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..