మక్కా యాత్రకు తగిలిన కొవిడ్-19 ప్రభావం!
- February 27, 2020
రియాద్: కరోనా వైరస్ (కొవిడ్-19) మక్కా యాత్రపై ప్రభావం చూపుతుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాల వారిని యాత్రకు అనుమతించేది లేదని ఆ దేశం తాజాగా వెల్లడించింది. అయితే ఈ నిషేధం ఎప్పటి వరకు ఉంటుంది, ఏయే దేశాల వారిని అనుమతించరన్న విషయాలు మాత్రం ఆ దేశం ఇంకా స్పష్టంగా ప్రకటించ లేదు. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు కేవలం హజ్ సమయంలోనే కాకుండా (ఉమ్రా) ఏడాది పొడవునా లక్షల సంఖ్యలో యాత్రికుల తాకిడి ఉంటుంది. దీనికోసం సౌదీ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రత్యేక వీసాలను జారీ చేస్తుంది. కానీ ఈ ఏడాది వీసాల జారీ విషయంలో ఆలోచనలో పడింది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇరాన్, కువైట్, బహ్రెయిన్ దేశాల్లో కూడా కరోనా ప్రభావం ఉంది. దీంతో అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం వైరస్ బాధిత దేశాల వారికి వీసాల జారీని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించమని పేర్కొంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







