బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మహేష్!?
- February 27, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబు...బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియవాలా ....ఎలాగైనా మహేష్ ని హిందీకి తీసుకురావాలని కంకణం కట్టుకుని వర్క్ అవుట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకోసం బాలీవుడ్లో హై సక్సెస్ పొందిన ప్రాంచైజ్ ని ఎన్నుకున్నారట. ఇందులో రణవీర్ సింగ్ ఒక హీరోగా చేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో మరో హీరోగా మహేష్ ని అడగనున్నారట. ఈ మేరకు బాలీవుడ్ లో వార్తలు వినపడుతున్నాయి. అయితే మహేష్ దగ్గరకు ప్రపోజల్ మాత్రం వచ్చిందిట. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
ఇక ఇదే కనుక జరిగితే రణవీర్ సింగ్, మహేష్ కాంబినేషన్ ఇటు సౌత్ ని అటు బాలీవుడ్ ని దుమ్ము రేపుతుందని అంటున్నారు. రణవీర్ సింగ్ కు సైతం సౌత్ లో మార్కెట్ ఏర్పడుతుంది. మహేష్ కు హిందీలో బేస్ వస్తుంది. అయితే హఠాత్తుగా ఈ వార్తలు వెనక కారణం..రీసెంట్ గా ఈ హీరోలిద్దరు కలిసి ధమ్స్ అప్ యాడ్ చేసారు. అది చూసిన సాజిద్ నడియవాలా ఈ ప్రపోజల్ కు ఉత్సాహపడుతున్నారట అయితే మహేష్ కు ఇస్తే సోలోగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనేది ఇంట్రస్ట్. అది కూడా ఇప్పుడిప్పుడే ఉండదని చెప్తూ వస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!