బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మహేష్!?

- February 27, 2020 , by Maagulf
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మహేష్!?

సూపర్ స్టార్ మహేష్ బాబు...బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియవాలా ....ఎలాగైనా మహేష్ ని హిందీకి తీసుకురావాలని కంకణం కట్టుకుని వర్క్ అవుట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకోసం బాలీవుడ్లో హై సక్సెస్ పొందిన ప్రాంచైజ్ ని ఎన్నుకున్నారట. ఇందులో రణవీర్ సింగ్ ఒక హీరోగా చేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో మరో హీరోగా మహేష్ ని అడగనున్నారట. ఈ మేరకు బాలీవుడ్ లో వార్తలు వినపడుతున్నాయి.  అయితే మహేష్ దగ్గరకు ప్రపోజల్ మాత్రం వచ్చిందిట. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

ఇక ఇదే కనుక జరిగితే రణవీర్ సింగ్, మహేష్ కాంబినేషన్ ఇటు సౌత్ ని అటు బాలీవుడ్ ని దుమ్ము రేపుతుందని అంటున్నారు. రణవీర్ సింగ్ కు సైతం సౌత్ లో మార్కెట్ ఏర్పడుతుంది. మహేష్ కు హిందీలో బేస్ వస్తుంది. అయితే హఠాత్తుగా ఈ వార్తలు వెనక కారణం..రీసెంట్ గా ఈ హీరోలిద్దరు కలిసి ధమ్స్ అప్ యాడ్ చేసారు. అది చూసిన సాజిద్ నడియవాలా ఈ ప్రపోజల్ కు ఉత్సాహపడుతున్నారట అయితే మహేష్ కు ఇస్తే సోలోగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనేది ఇంట్రస్ట్. అది కూడా ఇప్పుడిప్పుడే ఉండదని చెప్తూ వస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com