మార్చి 2 నుండి కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ ల చిత్రం షూటింగ్ ప్రారంభం
- February 27, 2020
తనదైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో నటించి మెప్పించిన కిరణ్ అబ్బవరం హీరోగా తన రెండవ చిత్రం ఎలైట్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో పూజాకార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం రెగ్యులర్ షూటంగ్ ని మార్చి 2 నుండి ప్రారంభిస్తున్నారు. టాక్సీవాలా లాంటి సూపర్‌హిట్ చిత్రం లో నటించి యువత మనసులు గెలుచుకున్న ప్రియాంక జవాల్కర్ కిరణ్ కి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఆర్ ఎక్స్ 100 మ్యూజిక్ దర్శకుడు చేతన్ భరద్వాజ్ మంచి సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీధర్ గడె దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అతి ముఖ్యమైన పాత్ర లో సాయికుమార్ నటిస్తున్నారు. రాజావారి రాణిగారు చిత్రం ద్వారా పరిచయమైన కిరణ్ పల్లెటూరి ప్రేమికుడిగా కనిపించాడు. ఇప్పడు ఈ చిత్రం కొసం తనని తాను మరో కొత్త కొణం లో చూపించటానికి స్టైలింగ్ మార్చుకున్నాడు. ఈ చిత్రం అందరిని అలరించేలా వుంటుందని నిర్మాతలు తెలిపారు..
నటినటులు.. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ , సాయికుమార్ తదితరులు నటించగా..
సంగీతం.. చైతన్ భరద్వాజ్
బ్యానర్.. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు.. ఎలైట్ గ్రూప్
దర్శకత్వం.. శ్రీధర్ గాదె
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







