బహ్రెయిన్:వెంటాడుతున్న కరోనా వైరస్..మరో 7 కొత్త కేసులు నమోదు
- February 28, 2020
బహ్రెయిన్:ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పుట్టిన చైనాలో వైరస్ తీవ్రత తగ్గుతున్నా..ఇతర దేశాల్లో వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి కింగ్ డమ్ వస్తున్న వారిలోనే ఎక్కువగా వైరస్ బయటపడుతోంది. లేటెస్ట్ మరో ఏడుగురికి కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ అని తేలింది. దీంతో కింగ్ డమ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 33కి పెరిగింది. కొత్తగా వైరస్ బారిన పడిన ఏడుగురు ఇరాన్ నుంచి వచ్చినవారే కావటం గమనార్హం. ఇరాన్ నుంచి నేరుగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వీరు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కోవిడ్-19 పాజిటీవ్ అని నిర్ధారణ అయిన వెంటనే వారిని ఇబ్రహీం ఖలీల్ కనూ కమ్యూనిటీ మెడికల్ సెంటర్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనా ఎఫెక్టెడ్ పేషేంట్లతో క్లోజ్ మూవ్ అయిన వ్యక్తులను కూడా బయట తిరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?