రియాద్:కరోనా అలర్ట్.. వర్క్, బిజినెస్ వీసా హోల్డర్స్ పై నో బ్యాన్
- February 28, 2020
రియాద్:కరోనా వైరస్ ఎఫెక్ట్ తో గల్ప్ కోఆపరేటీవ్ కౌన్సిల్ దేశాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..ఉపాధి కోసం వచ్చే వారికి సౌదీ అరేబియా గుడ్ న్యూస్ తెలిపింది. వర్క్ వీసా, ఎంప్లాయ్ మెంట్ వీసా, బిజినెస్ వీసా, ఫ్యామిలి విజిట్ వీసాలపై తమ దేశానికి వచ్చే వారిపై ఎలాంటి నిషేధం లేదని క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో అన్ని రకాల టూరిజం వీసాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక మల్టిపుల్ రీ ఎంట్రీ వీసా హోల్డర్స్ కు కొన్ని కండీషన్స్ పెట్టింది. మల్టిపుల్ వీసా హోల్డర్స్ సౌదీ అరేబియాకు రావాలంటే కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ లో రెండు వారాలుగా విజిట్ చేయలేదని అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ఇక కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ లిస్టులో ఉన్న చైనా, చైనీస్ తైపీ, హాంకాంగ్, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా, మకావో, జపాన్, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్, సింగపూర్, ఇండియా, లెబనాన్, సిరియా, యెమెన్, అజర్‌బైజాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, సోమాలియా నుంచి టూరిజం వీసాలను అనుమతించబోమని హెల్త్ మినిస్ట్రి స్పష్టం చేసింది. అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే ఎయిర్ లైన్ క్రూకి కూడా అనుమతి నిషేధం అమల్లో ఉండనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?