కరోనా వైరస్‌పై ఇండియన్ కాన్సులేట్ సూచనలు
- February 28, 2020
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్‌కి ఇండియన్ కాన్సులేట్ జనరల్ దుబాయ్, కరోనా వైరస్‌కి సంబంధించి పలు సూచనలు చేసింది. కరోనా వైరస్ (కోవిడ్19) విషయంలో అప్రమత్తంగా వుండాలనీ సూచిస్తూ, పలు సూచనల్ని ఓ ప్రకటనలో పేర్కొంది. జంతువులకు దూరంగా వుండాలనీ, యానిమల్ మార్కెట్స్ విషయంలో అప్రమత్తంగా వుండాలనీ సూచించిన కాన్సులేట్, రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతున్నవారికి దూరంగా వుండాలనీ పేర్కొంది. చేతుల్ని కనీసం 20 సెకెండ్లపాటు ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాల్సి వుంటుంది. సోప్ లేదా వాటర్ అందుబాటులో లేనప్పుడు హ్యాండ్ శానిటైజర్ వాడాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూస్ వాడాలి. అనారోగ్య సమస్యలున్నప్పుడు ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం మానుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, దుబాయ్ హెల్త్ అథారిటీని అనారోగ్య సమస్యలున్నప్పుడు సంప్రదించాలి. కాన్సులేట్‌లో కూడా సంప్రదించవచ్చు. సోషల్ మీడియా అక్కౌంట్ల ద్వారా కాన్సులేట్ అందించే సమారారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు