దోహాలో చారిత్రాత్మక ఘటన..

- February 28, 2020 , by Maagulf
దోహాలో చారిత్రాత్మక ఘటన..

దోహాలో శనివారం చారిత్రాత్మక ఘటన చోటుచేసుకోనుంది. అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం జరగనుంది. ఈ మైలురాయి ఒప్పందానికి భారత్ కూడా హాజరుకానుంది. అందులో భాగంగా ఖతార్‌లోని భారత రాయబారి హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత రాయబారి పి.కుమారన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ ఒప్పందంతో తాలిబాన్లతో కూడిన ఒప్పందం కార్యక్రమానికి భారత్ అధికారికంగా హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా ఈ చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. 2001 నుండి ఆఫ్ఘనిస్తాన్ లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com