APNRTS ఆధ్వర్యంలో టెక్సాస్‌లో ఉపాధ్యాయుల నియామకం
- February 28, 2020
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపిఎన్ఆర్టిఎస్) అందించే వివిధ సేవలలో అంతర్జాతీయ నియామకాలు ఒకటి. రాష్ట్రంలో బోధనా రంగం లో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు అంతర్జాతీయ ఉపాధ్యాయులుగా బోధించే అవకాశం కల్పిస్తోంది. టెక్సాస్ లోని పలు జిల్లా పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఏపిఎన్ఆర్టిఎస్. ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను గుర్తించిన అక్కడి పాఠశాల అధికారులు, ఉపాధ్యాయుల నియామకానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపిఎన్ఆర్టిఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) లోని స్టార్ టెక్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AGE) తో కలిసి చేపట్టిన అంతర్జాతీయ నియామకాల్లో టెక్సాస్ లోని పలు జిల్లా పాఠశాలల్లో పనిచేయడానికి 50 మంది గణితం, సైన్సు, ఆంగ్లం, స్పెషల్ ఎడ్యుకేషన్ బోధించే ఉపాధ్యాయుల అవసరం ఉందని ఏపీఎన్ఆర్టీ సొసైటీని సంప్రదించింది. మొదటి దశలో గణితం, సైన్సు బోధించే అర్హులైన ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించి జనవరి 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 96 మంది ఉపాధ్యాయులు అర్హత పరీక్షకు హాజరయ్యారు, అందులో 10 మంది ఉపాధ్యాయులు ఆఫర్ లెటర్స్ అందుకున్నారు, మిగిలిన ఉపాధ్యాయుల ఎంపిక ప్రాసెస్ లో ఉంది. మలి దశలో భాగంగా ఏపిఎన్ఆర్టిఎస్ ఏజీఈ తో కలసి ఆంగ్లం, స్పెషల్ ఎడ్యుకేషన్ బోధించే అర్హులైన ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్పెషల్ ఎడ్యుకేటర్ సర్టిఫైడ్ అయిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఉంటుంది.
అంతర్జాతీయ ఉపాధ్యాయులుగా ఎంపిక అవడానికి … బి.ఎడ్/ఎం.ఈ.డి కలిగి ఉండి, బోధనా రంగం లో 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఉపాధ్యాయులు/ కాలేజీల్లో బోధించే లెక్చరర్లు దరఖాస్తు చేయవచ్చని ఏపిఎన్ఆర్టిఎస్ అధికారులు తెలియజేసారు. వీసా ప్రాసెస్ కొరకు టోఫెల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఎంపికైన ఉపాధ్యాయులకు ౩ సంవత్సరాల గడువు కలిగిన J1 వీసా పొందుతారు. దీనిని మరో 2 సంవత్సరాలు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఎంపికైన ఉపాధ్యాయులు యూఎస్ఏ కు వెళ్ళే ముందు వారికి అక్కడి బోధనా పద్దతులు, నియమ నిబంధనల గురించి ఏపిఎన్ఆర్టిఎస్ కార్యాలయం లో రెండు వారాల పాటు అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రతినిధులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపిఎన్ఆర్టిఎస్ అధికారులు సూచించారు.
ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడానికి https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs లాగిన్ అవ్వండి. దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 05 మార్చి 2020.
మరింత సమాచారం కొరకు ఏపిఎన్ఆర్టిఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు 0863 2340678, 8500027678 ను సంప్రదించండి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..