కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు..
- February 29, 2020
వైరస్‌లు ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తాయి. ఎక్కడో చైనాలో కదా వచ్చింది. మనకెందుకు వస్తుందిలే అని అనుకోవడానికి లేదు. మంచి రావడం ఆలస్యమవుతుందేమో కానీ, చెడు రావడం ఎంత సేపు.. నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ఏడుగురికి కరోనా వైరస్ సోకి ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మన అనుమానాలకు ఆజ్యం పోసినట్టైంది. అలాగే హైదరాబాద్‌లోనూ నలుగురికి ఈ వ్యాధి సోకి ఉండవచ్చని అంటున్నారు. ఆ అనుమానంతోనో వారికి టెస్టులు చేస్తున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఎందుకైనా మంచిది కొన్ని జాగ్రత్తలు మనమూ తీసుకుందాం.
కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు: ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతుంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఇబ్బంది పెడుతుంటాయి. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఈ లక్షణాలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
వ్యాధి వ్యాపించే విధానం: వ్యాధి వచ్చిన వారు తుమ్మినా దగ్గినా పక్కవారికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా వైరస్ వచ్చేస్తుంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ బాడీపైకి వచ్చి క్రమంగా అవి నోట్లోనుంచి ఊపిరితిత్తుల్లోకి వెళతాయి. చేతులు శుభ్రం చేసుకునేలోపే ఈ వైరస్ వచ్చేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు లేదు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సబ్బుతో చేతులు శుభ్రపరచుకుంటూ ఉండాలి. దగ్గు, జలుబు, జ్వరం వస్తే ఇంట్లోనే ఉంటూ ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. అదే తగ్గిపోతుందిలే అని అశ్రద్ద చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!