రైట్స్ లిమిటెడ్ లో ఉద్యోగావకాశాలు
- February 29, 2020
రైట్స్ లిమిటెడ్ .. ఇది భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ .. ఇది గురుగ్రామ్ లో ఉంది . ఈ రైట్స్ లిమిటెడ్ లో దాదాపు 35 వరకూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది . అన్నీ ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నావారికే అర్హత ఉంది.
ఇంజినీర్ ( సివిల్ ) మొత్తం ఖాళీలు : 35 ఉన్నాయి . అర్హత : బీఈ / బీటెక్ / బీఎస్సీ సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫికేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు . అనుభవం కూడా ఉండాలి . మరో విషయం వయసు : 01.02.2020 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది . దరఖాస్తు ఫీజు కూడా ఉంటుంది . ఈ దరఖాస్తు ఫీజు జనరల్ , ఓబీసీ అభ్యర్థులకు రూ .600 అయితే .. ఇతరులకు రూ .300 రూపాయలు.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి . ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 23, 2020. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ : https://rites.com/ చూడొచ్చు . మరో ముఖ్యమైన విషయం ఏంటంటే .. ఇవన్నీ ఒప్పంద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు .
తాజా వార్తలు
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC