పాకిస్థాన్‌లో బస్సు--రైలు ప్రమాదం 30మంది మృతి...

- February 29, 2020 , by Maagulf
పాకిస్థాన్‌లో బస్సు--రైలు ప్రమాదం 30మంది మృతి...

పాకిస్తాన్‌లో ఓ బస్సు రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. మరో 60 మందికి గాయాలయ్యాయి. కరాచీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుక్కూర్ జిల్లాలోని కంధ్రా పట్టణంసమీపంలోని రోహ్రీ ప్రాంతంలో కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న బస్సు మానవరహిత రైల్వే క్రాసింగ్‌ను దాటి పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నంలో ఒక బస్సు-రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. పలువురు గాయపడ్డారని సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ మెహ్సర్ ధృవీకరించారు.

గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నామని వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందనీ దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు తునాతునకలయ్యింది. ఇది ఘోర ప్రమాదమని సుక్కూర్ పోలీసు అధికారి జమీల్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆ రైలు... బస్సును 150 నుంచి 200 అడుగుల వరకు లాక్కొని వెళ్లిపోయిందని తెలిపారు. కాగా సింధ్ సీఎం మురాద్ అలీ షా ఘటనా స్థలానికి తక్షణం సహాయక బృందాలను తరలించాలని సుక్కూర్ కమిషనర్‌ను ఆదేశించారు.

కాగా..పాకిస్థాన్ లో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కారణం..మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవటం..భద్రత విషయంలో అధికారులు తగిన చర్యలపై దృష్టి పెట్టకపోవటంతో తరచూ పాక్ లో రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు రైలు ప్రమాదాలకు బలైపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com