ఉమ్రా యాత్రికులను అడ్డుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు
- February 29, 2020
కేరళ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పవిత్ర నగరాలు మక్కా, మదీనాల సందర్శనలను సౌదీ అరేబియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే సందర్శకులను ఈ నగరాలకు రాకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి చెందిన దేశాల నుండి పర్యాటకులను ఇక్కడికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలోనే గురువారం కాలికట్ నుంచి సౌదీ వెళ్లేందుకు వచ్చిన సుమారు 200 మంది ఉమ్రా యాత్రికులను అధికారులు విమానాల నుంచి కిందకి దించేశారు. సౌదీ ఎయిర్లైన్స్ నుంచి 84 మంది ప్రయాణికులను, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ నుంచి 104 మందిని ఎయిర్పోర్ట్ అధికారులు తిరిగి ఇంటికి పంపించారు.
కాగా, కొంత మంది జెడ్డా వెళ్తున్న ప్రయాణికులను మాత్రమే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. కరోనా భయంతో సౌదీ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికులను తాత్కాలికంగా తమ దేశంలోకి అనుమతించడం లేదు. అందుకే సౌదీ వెళ్తున్న కేరళ యాత్రికులను అధికారులు అడ్డుకున్నారు. గల్ఫ్ దేశాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి మక్కా, మదీనా వచ్చే యాత్రిలకులపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా నగరాలకు సౌదీ నిలయం.వీటిని సందర్శించేందుకు ఏడాది పొడవునా లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు.విదేశీ యాత్రికుల కోసం సౌదీ సర్కార్ గత అక్టోబర్లో 49 దేశాలకు కొత్త టూరిజం వీసాను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై సస్పెన్షన్ విధిస్తూ సౌదీ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ సస్పెన్షన్లు తాత్కాలికమైనవని, వీటి గడువుకు ఎలాంటి కాలపరిమితి లేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







