జిసిసి పటిష్టం - ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధం

- January 22, 2016 , by Maagulf
జిసిసి పటిష్టం - ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధం

సాధించిన విజయాలు, అభివృద్ధి, యూనిటీ ఇవన్నీ గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ పటిష్టతకు నిదర్శనాలని జిసిసి సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ అబ్దుల్‌ అతీఫ్‌ బిన్‌ రషీద్‌ అల్‌ జయాని చెప్పారు. అబుదాబీలో జరిగిన ఓ కార్యక్రమంలో అల్‌ జయానీ ఈ వ్యాఖ్యలు చేశారు. జిసిసి ఎలాంటి ఛాలెంజెస్‌ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఎమిరేట్స్‌ సెంటర్‌ ఫర్‌ స్ట్రేటజిక్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌లో ఈ వ్యాఖ్యలు చేసిన అల్‌ జయానీ, ఇరాన్‌, యెమెన్‌ సమస్యలతోపాటు, తీవ్రవాద ముప్పును గురించీ మాట్లాడారు. ఇరాన్‌ గురించి మాట్లాడుతూ రీజియన్‌లో ఆయుధాల వాడకాన్ని తగ్గించడం, అలాగే మాస్‌ డిస్ట్రక్షన్‌ లేకుండా చేయడం వంటివి ప్రాధాన్యతాంశాలని అన్నారు. ఇరాన్‌ పొరుగుదేశమనీ, ఇరాన్‌ ప్రజలతో సఖ్యత చారిత్రాత్మకమని, జిసిసి దేశాల నిర్ణయం ప్రకారం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని ఆయన అన్నారు. యెమెన్‌ పునర్నిర్మాణంలో జిసిసి పాత్ర అమోఘమైనదని అల్‌ జయానీ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com