విద్యుత్‌ సమస్యతోనే హోటల్‌లో ప్రమాదం

- January 22, 2016 , by Maagulf
విద్యుత్‌ సమస్యతోనే హోటల్‌లో ప్రమాదం

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దుబాయ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంపై దుబాయ్‌ పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. విచారణలో ఎక్కడా పేలుడు పదార్థాలుగానీ, గ్యాస్‌ లేదా పెట్రోల్‌ మంటలు సంభవించినట్లు ఆధారాలు దొరకలేదనీ, పూర్తిగా విద్యుత్‌ సమస్య కారణంగానే మంటలు సంభవించి ఉండొచ్చని దుబాయ్‌ పోలీస్‌ చీఫ్‌ ఖామిస్‌ మట్టర్‌ అల్‌ మజైనా చెప్పారు. 63 అంతస్తులు గల అడ్రస్‌ హోటల్‌ కమ్‌ రెసిడెన్షియల్‌ బ్లాక్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ సంభవించలేదు. కొందరికి గాయాలు మాత్రం అయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి పలువురు చిత్రీకరించిన వీడియోలను సాక్ష్యంగా తీసుకుని, పరిశీలించారు. వీటిల్లో ప్రమాదం అనంతరం మండుతున్న చిన్న చిన్న వస్తువులు కిందకి జారాయనీ, అవి ఫైర్‌ వర్క్స్‌ కావని అధికారులు తేల్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com