ఢిల్లీ:పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు
- March 02, 2020
ఢిల్లీ:పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ సమావేశాల్లో సుమారు 45 బిల్లులు, 7 ఆర్థిక పద్దులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. బ్యాంకులు దివాలా తీయడం, ఖనిజ సవరణ చట్టాలు-2019 ఆర్డినెన్స్ లను కూడా ఉభయసభల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సరోగసీతో పాటు పలు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సమావేశాల్లో.. ఢిల్లీ అల్లర్ల అంశమే ప్రధానంగా ఫోకస్ కానుంది. ఈ హింసాత్మక ఘటనలపై మోదీ సర్కారుపై ఎదురుదాడి చేయాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజీనామా చేయాలని ఇప్పటికే డిమాండ్ చేశాయి. అయితే.. విపక్షాల వ్యూహలకు కౌంటర్ ఇచ్చేందుకు కేంద్రం సైతం రెడీ అవుతోంది. విపక్షాల తప్పుడు ప్రచారం వల్లే అల్లర్లు జరుగుతున్నాయంటూ కౌంటర్ అటాక్ చేసేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు.
ఇక ఈ సమావేశాల్లో… తెలుగు రాష్ట్రాలు సైతం పలు అంశాలను లెవనెత్తేందుకు రెడీ అవుతున్నాయి. ప్రధానంగా అమరావతి రాజధాని మార్పు, రైతులపై ప్రభుత్వ అణిచివేత అంశాలపై పార్లమెంట్లో లేవనెత్తేందుకు తెలుగుదేశం సమాయత్తమైంది. కేంద్ర పెద్దలను కలిసి ఏపీ పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరనుంది టీడీపీ. అటు.. ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాపైనా కేంద్రాన్ని నిలదీయనుంది టీఆర్ఎస్.
తాజా వార్తలు
- కువైట్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







