స్పెషల్‌ మంత్‌: నెట్‌వర్క్‌ పేరు మార్చిన యూఏఈ టెలికాం ఆపరేటర్‌

- March 02, 2020 , by Maagulf
స్పెషల్‌ మంత్‌: నెట్‌వర్క్‌ పేరు మార్చిన యూఏఈ టెలికాం ఆపరేటర్‌

యూఏఈలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్‌ అయిన ఎటిసలాట్‌, ఆదివారం తమ నెట్‌వర్క్‌ పేరుని ‘యూఏఈ రీడ్స్‌’గా మార్చింది. నేషనల్‌ మంత్‌ ఆఫ్‌ రీడింగ్‌ సందర్భంగా ఈ మార్పు జరిగిందని ఎటిసలాట్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రతి యేడాదీ మార్చి నెలను ‘రీడింగ్‌ మంత్‌’గా పాటిస్తున్నారు. నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ రీడింగ్‌ని 2016-2026 వరకు యూఏఈ ప్రారంభించింది. లైఫ్‌ స్టయిల్‌లో రీడింగ్‌ని ఓ భాగం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. స్టూడెంట్స్‌, ఉద్యోగుల్ని, హౌస్‌హోల్డ్స్‌ని కూడా ఇందులో భాగం చేశారు. ఎడ్యుకేషన్‌, హెల్త్‌, కల్చర్‌, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ మీడియా మరియు కంటెంట్‌ సెక్టార్స్‌ని ఇందులో పొందుపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com