పొరుగూరు వెళ్ళిన పెంపుడు సింహం
- January 22, 2016
సింగల్ గానే సింహం పొరుగూరు వెళ్లి , ప్రజలారా... ఎలా ఉన్నారంటూ ఘర్జిస్తుంటే ఊరూవాడ హడలిపోయారు. క్షణాల్లో ఆ ప్రాంతాలన్నీ నిర్జన ప్రదేశాలుగా మారిపోయాయి బెంబేలెత్తిన జనం ఎట్టకేలకు వన్యప్రాణి సంరక్షణ అధికారులకు ఈ సమాచారం అందించారు. ఓ పెంపుడు సింహం తన యజమాని వద్ద నుండి తప్పించుకొని గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో దుబాయ్ సమీపంలోని ' అల్ బర్ష ' ప్రాంతానికి పర్యటనకు వెళ్ళింది. భయపడిపోయిన ప్రజలు ఇచ్చిన పిర్యాదుకు స్పందించి దుబాయ్ మునిసిపాలిటీ నుంచి వన్యప్రాణి ప్రత్యేక అధికారులను అక్కడకు పంపించారు. వారు నానా అవస్థలు పడి ఆ మృగరాజును ఎట్టకేలకు బందించినట్లు స్థానిక పత్రికలు వార్తను ప్రచురించాయి. ఈ వార్తను సంబంధిత అధికారులు సైతం దృవీకరించారు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆ సింహంను ' జూ ' కు తరలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, అంతరించిపోతున్న అరుదైన అడవి జంతువులను ఎంతటి వారైనా బంధించి పెంచుకోవడం పెద్ద నేరమన్నారు. యు.ఎ.ఇ. సమాఖ్య చట్టాల కింద ఇది విరుద్ధమైన తీవ్ర చర్య అని పేర్కొన్నారు. ఇటీవల దుబాయ్ సమీపంలో కొందరు తమ కార్లలో పెద్ద పులులను పక్కన కూర్చెండబెట్టుకొని షికార్లకు వెళుతున్నట్లు ఆ ప్రాంతీయులు పలుమార్లు గమనించి తమకు తెలిపారన్నారు. ఆఫ్రికా అడువుల నుండి క్రూర జంతువులను రహస్యంగా దిగుమతి చేసుకోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్‌తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









