ఐస్ క్రీం తినడంతో నోటి నుంచి రక్తం
- March 02, 2020
హైదరాబాద్:పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఐస్ క్రీం తిన్న వారి నోటి నుంచి రక్తం రావడం కలకలం రేపింది. పాతబస్తీలోని ఒవైసీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓవైసీ నగర్ లోని ఫయాజ్ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు.. రోడ్లపై తిరుగుతూ ఐస్ క్రీంలు అమ్మే తోపుడు బండి దగ్గర ఐస్ క్రీం కొనుగోలు చేసి తిన్నారు. అది నాలుకపై వేసుకున్న వెంటనే నాలుక పగిలి రక్తం రావడాన్ని గుర్తించి ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఐస్ క్రీం అమ్మిన వ్యక్తిని పట్టుకొని.. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఐస్ క్రీం అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..