నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
- March 02, 2020
న్యూఢిల్లీ: పాటియాలా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించేది లేదని తేల్చి చెప్పింది. స్టే విధించాలన్న పవన్ కుమార్, అక్షయ్ సింగ్‌ల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
మార్చి 03న నిర్భయ దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన తెలిసిందే. రేపు ఉదయం 6 గంటలకే దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే ఢిల్లీ కోర్టు, సుప్రీం కోర్టుల్లో నిందితులు పిటిషన్లు వేశారు. తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని సుప్రీం కోర్టులో పవన్‌గుప్తా పిటిషన్ వేయగా.. క్యూరేటివ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.
అలాగే తమ క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ పవన్ కుమార్, అక్షయ్ సింగ్ పాటియాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. స్టే విధించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఉరిశిక్ష అమలుపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. దోషులకు రేపు ఉరి అమలు చేయనున్నారు. ఇదిలా ఉంటే పాటియాల కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు, ప్రజా సంఘాలనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..