ఇవాంక మార్ఫింగ్ ఫొటోలు వైరల్..ఆమె ఎలా స్పందించింది?
- March 02, 2020
ఎవరైనా తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఏమనిపిస్తుంది. చిర్రెత్తికొచ్చి తిడతాం.. పోలీసులకు కంప్లైంట్ చేస్తాం. ఇక సెలెబ్రెటీలను అలా మార్ఫింగ్ చేసి ఆడుకుంటే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని అరెస్ట్ చేయించేదాక వదలరు.
కానీ అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ తాజాగా తన గొప్ప మనసు చాటారు. తనపై నెగెటివ్ ప్రచారం చేసినా కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. విష ప్రచారాన్ని కూడా సానుకూల ధృక్పథంతో ఇవాంక ధన్యవాదాలు చెప్పిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల భారత దేశంలో పర్యటించిన ట్రంప్ తోపాటు ఆయన కూతురు ఇవాంక ట్రంప్ కూడా వచ్చారు. ఆగ్రాలోని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ను సందర్శించి అక్కడ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఆ ఫొటోలను కొందరు నెటిజన్లు మార్ఫింగ్ చేసి తమకు తోచిన సెటైరికల్ గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
అయితే తన ఫొటోలు మార్ఫింగ్ చేసి నెటిజన్లు ఆడుకున్నా కూడా ఇవాంక మాత్రం 'ఇండియన్స్ , తాజ్ మహల్ నా మనసు దోచేసింది. మీ ప్రేమకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేయడం విశేషం. ఇవాంక స్పందనకు భారతీయ నెటిజన్లు, మార్పింగ్ చేసిన ప్రముఖ సింగర్ దిల్జిత్ దోషంత్ కూడా ఆశ్చర్యపోయి ఇవాంకకు ధన్యవాదాలు తెలిపారు.
Thank you for taking me to the spectacular Taj Mahal, @diljitdosanjh! 😉
— Ivanka Trump (@IvankaTrump) March 1, 2020
It was an experience I will never forget! https://t.co/VgqFuYBRIg
I appreciate the warmth of the Indian people.
— Ivanka Trump (@IvankaTrump) March 1, 2020
...I made many new friends!!! https://t.co/MXz5PkapBg
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..