దోహా:అమెరికా-తాలిబన్ డీల్ చరిత్రలో మైల్ స్టోన్..

- March 02, 2020 , by Maagulf
దోహా:అమెరికా-తాలిబన్ డీల్ చరిత్రలో మైల్ స్టోన్..

దోహా:అమెరికా- తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మిడిల్ ఈస్ట్ రిజీయన్ లో శాంతి పునరుద్ధరణకు మరో మైలు రాయి అని ఖతార్ అభివర్ణించింది. ఈ మేరకు ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ట్వీట్ చేశారు. శాంతి చరిత్రలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలిచిపోతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన యూఎస్ సెక్రెటరీ మైక్ పొంపియోతో పాటు అందరికీ ఆయన తన ట్వీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అమెరికా-తాలిబన్ డీల్ లో సహకరించిన ఖతార్ కు ధన్యవాదాలు అంటూ పొంపియో చేసిన ట్వీట్ కు రిట్వీట్ చేసిన మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ఈ శుభపరిణామాల నేపథ్యంలో శాంతి స్థాపన విషయంలో అమెరికాకు కోఆపరేట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com