10 మిలియన్ దిర్హామ్ ల బిగ్ టిక్కెట్ అబుధాబి ర్యాఫిల్
- March 02, 2020
అబుధాబి:10 మిలియన్ దిర్హామ్ ల విలువైన బిగ్ టికెట్ అబుధాబి ర్యాఫిల్ డ్రా మార్చి 3న జరుగుతుంది. అయితే, పబ్లిక్‌కి ఈ డ్రా కోసం అనుమతి లేదు. దీన్ని ప్రైవేటు ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. కోవిడ్ వైరస్ అలర్ట్ నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా మూడవ తేదీన అబుధాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 ఎరైవల్స్ ఏరియాలో ఈ డ్రా నిర్వహిస్తారు. అయితే, నిర్వాహకులు ఈసారి కరోనా ఎఫెక్ట్ కారణంగా, ప్రైవేట్ లొకేషన్లో డ్రా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బిగ్ టికెట్ ఫేస్బుక్, అలాగే యూ ట్యూబ్ పేజెస్‌లో సాయంత్రం 7.30 నిమిషాల నుంచి ఈ డ్రా కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం వుంది. 10 మిలియన్ దిర్హామ్ ల మెగా ప్రైజ్తోపాటుగా మరిన్ని బహుమతులు కూడా విజేతల కోసం ఎదురుచూస్తున్నాయి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







