10 మిలియన్‌ దిర్హామ్ ల బిగ్‌ టిక్కెట్‌ అబుధాబి ర్యాఫిల్

- March 02, 2020 , by Maagulf
10 మిలియన్‌ దిర్హామ్ ల బిగ్‌ టిక్కెట్‌ అబుధాబి ర్యాఫిల్

అబుధాబి:10 మిలియన్‌ దిర్హామ్ ల విలువైన బిగ్‌ టికెట్‌ అబుధాబి ర్యాఫిల్  డ్రా మార్చి 3న జరుగుతుంది. అయితే, పబ్లిక్‌కి ఈ డ్రా కోసం అనుమతి లేదు. దీన్ని ప్రైవేటు ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ వైరస్‌ అలర్ట్‌ నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా మూడవ తేదీన అబుధాబి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ టెర్మినల్‌ 1 ఎరైవల్స్‌ ఏరియాలో ఈ డ్రా నిర్వహిస్తారు. అయితే, నిర్వాహకులు ఈసారి కరోనా ఎఫెక్ట్‌ కారణంగా, ప్రైవేట్‌ లొకేషన్‌లో డ్రా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బిగ్‌ టికెట్‌ ఫేస్‌బుక్‌, అలాగే యూ ట్యూబ్‌ పేజెస్‌లో సాయంత్రం 7.30 నిమిషాల నుంచి ఈ డ్రా కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం వుంది. 10 మిలియన్‌ దిర్హామ్ ల మెగా ప్రైజ్‌తోపాటుగా మరిన్ని బహుమతులు కూడా విజేతల కోసం ఎదురుచూస్తున్నాయి.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com