2019లో పట్టుబడ్డ 48,000 జేవాకర్స్
- March 02, 2020
అబుధాబి:48,000 మంది పెడెస్ట్రియన్స్ నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా, ఇతర ప్రాంతాల్లో రోడ్డు దాటుతూ పట్టుబడ్డారు 2019లో. అబుదాబీకి సంబంధించిన ఈ గణాంకాల్ని పోలీసులు వెల్లడించారు. జేవాకింగ్‌కి 400 దిర్హామ్ ల జరీమానా విధిస్తున్నారు. ఈ జేవాకింగ్ అనేది ఇటు పాదచారులకీ, అటు వాహనదారులకీ ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెడెస్ట్రియన్స్ తమకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే రోడ్డు దాటాలని అధికారులు సూచిస్తున్నారు. మరోపక్క, జేవాకింగ్‌లోనూ ఫోన్ మాట్లాడుతూ వుండేవారి వల్ల రిస్క్ మరింత పెరుగుతోందని అధికారులు చెప్పారు. పాదచారుల భద్రత కోసం అలాగే వాహనాల ప్రమాదాల్ని నివారించేందుకోసం చాలా ప్రాంతాల్లో జీబ్రా క్రాసింగ్స్‌ని ఏర్పాటు చేయడంతోపాటుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. తగినన్ని సౌకర్యాలు వున్నా, నిర్లక్ష్యపూరితంగా రోడ్లపై ఎక్కడికక్కడ క్రాస్ చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!