బహ్రెయిన్ లో మరో 6 కోవిడ్-19 కేసులు
- March 02, 2020
బహ్రెయిన్:కరోనా కోరలు చాచి ప్రపంచదేశాలపై విరుచుకుపడుతూనే ఉంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. బహ్రెయిన్ లో కొత్తగా మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. ఇరాన్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులకు కోవిడ్-19 పాజిటీవ్ వచ్చినట్లు నిర్ధారించారు. ఈ ఆరుగురిలో ఐదుగురు బహ్రెయిన్ కు చెందివారు. మరొకరు సౌదీ పౌరుడు. వాళ్లందర్ని చికిత్స కోసం ఐసోలేటెడ్ వార్డుకు తరలించి స్పెషల్ టీంతో చికిత్స అందిస్తున్నారు. కొత్త నమోదైన ఆరుగురు పేషెంట్లతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 47కి పెరిగింది. ఇప్పటి వరకు 1977 మందికి కోవిడ్-19 టెస్టులు జరిపినట్లు హెల్త్ మినిస్ట్రి ఒక ప్రకటనలో తెలిపింది.
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా పేషెంట్లను ట్రీట్ చేసేందుకు సమర్ధులైన డాక్టర్లతో స్పెషల్ టీంను
ఏర్పాటు చేసింది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసింది. అలాగే టెస్టింగ్ కోసం టైం స్లాట్ బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్ సైట్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చే వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఇరాన్ నుంచి వచ్చిన 2,292 మందికి మొబైల్ టెస్టింగ్ చేస్తున్నారు. అలాగే ఇరాన్ నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు తమకు తాము జాగ్రత్తలు తీసుకోవాలని, వైరస్ టెస్టు రిజల్ట్స్ వచ్చే వరకు జనాల్లో తిరగొద్దని అధికారులు సూచించారు. కోవిడ్-19 టెస్టులు చేసుకునేందుకు www.gov.bh/444 లో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..