ఎం.ఎ యూసుఫ్ అలికి సౌదీ ప్రీమియం రెసిడెన్సీ
- March 03, 2020
సౌదీ అరేబియా:లులు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అలాగే యూఏఈ బేస్డ్ వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్‌అలి, సౌదీ అరేబియా ‘ప్రీమియం రెసిడెన్సీ’ పర్మిట్‌ని పొందారు. ఈ మేరకు లులు గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రీమియవ్‌ు రెసిడెన్సీ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంటూ, కింగ్‌డవ్‌ు, వ్యాపారవేత్తలకు డెస్టినేషన్‌గా మారుతోందని, ఎకానమీలో మెరుగైన వృద్ధిని సాధిస్తోందని వెల్లడించింది. గత నవంబర్‌లో సౌదీ అరేబియా 73 మంది అప్లికెంట్స్‌కి ప్రీమియం రెసిడెన్సీని గ్రాంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బిజినెస్ లైసెన్సుల్ని సులభంగా పొందడం, రియల్ ఎస్టేట్ లేదా వ్యాపారం ఓనర్‌షిప్‌ని స్పాన్సర్ లేకుండా పొందడం వంటివి ఈ ప్రీమియం రెసిడెన్సీతో సాధ్యమవుతాయి. యూసుఫ్ అలీ మాట్లాడుతూ, ఈ గౌరవం దక్కించుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. సౌదీ అరేబియా అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. లులు గ్రూప్ 35కి పైగా హైపర్ మార్కెట్లు అలాగే సూపర్ మార్కెట్లను సౌదీ అరేబియాలో నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!