పెడెస్ట్రియన్స్‌ కోసం వాహనాలు ఆపని డ్రైవర్లను గుర్తించే డివైజ్‌

- March 03, 2020 , by Maagulf
పెడెస్ట్రియన్స్‌ కోసం వాహనాలు ఆపని డ్రైవర్లను గుర్తించే డివైజ్‌

దుబాయ్‌: దుబాయ్‌ పోలీస్‌, రెక్లెస్‌ డ్రైవర్లను గుర్తించేందుకు స్మార్ట్‌ డివైజ్‌ని ప్రారంభించింది. రోడ్‌ క్రాసింగ్స్‌ వద్ద పెడెస్ట్రియన్లకు దారి ఇవ్వని వాహనదారుల్ని ఈ స్మార్ట్‌ డివైజ్‌ గుర్తిస్తుంది.దుబాయ్‌ పోలీస్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ సైఫ్‌ ముహైర్‌ అల్‌ మజ్రోయి మాట్లాడుతూ, పెడెస్ట్రియన్స్‌కి దారి ఇవ్వని వాహనదారుల కోసమే ఈ డివైజ్‌ రూపొందించామని చెప్పారు. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా విద్యుత్‌ని జనరేట్‌ చేసి, ఆ విద్యుత్‌ని ఈ డివైజెస్‌కి అందించేలా ఏర్పాటు చేశారు. 4జి టెక్నాలజీ ద్వారా ఉల్లంఘనుల్ని ఈ డివైజ్‌ గుర్తిస్తుంది. ఉల్లంఘనులకు 500 దిర్మామ్ ల జరీమానా అలాగే 6 ట్రాఫిక్‌ పాయింట్స్‌ విధిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com