ఢిల్లీలో మరో ఆరుగురికి కోవిడ్-19
- March 03, 2020
కరోనా వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్ లో వైద్యసాయం పై ఆరా తీస్తోంది. ఇదిలావుంటే, సోమవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఢిల్లీ వ్యక్తి.. నోయిడాలో శుక్రవారం బర్త్ డే పార్టీ ఇచ్చినట్టు గుర్తించారు. బర్త్ డే పార్టీలో బాధితుడి పిల్లలతో పాటు.. వారి స్నేహితులు, కొందరు తల్లిదండ్రులు, టీచర్లు పాల్గొన్నారు. వీరిలో ఆరుగురు కరోనా బారిన పడినట్టు గుర్తించిన కేంద్రం.. వారి రక్తనమూనాలను పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించింది. బాధితులను ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఇక, బర్త్ డే పార్టీకి హాజరైన పిల్లలందరికీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా పిల్లలు చదువుతున్న స్కూల్ కు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. పరీక్షలను కూడా వాయిదా వేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు స్కూల్ తో సంబంధం వున్న 40 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..