దోహా:ఓ ఐడియాతో దోహా మెట్రో కార్డ్స్ కు పెరిగిన డిమాండ్
- March 03, 2020
దోహా మెట్రో రైల్ సర్వీసులో పేపర్ టికెట్ల యూసేజ్ ను భారీగా తగ్గించేందుకు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్షన్ లో భాగంగా గత నెల 20న పేపర్ టికెట్లపై ధరలను పెంచింది దోహా మెట్రో రైల్వే. ఫిబ్రవరి 20కి ముందున్న 2QR ఉన్న టికెట్ ధరను 3QRకు పెంచింది. అలాగే 6QRగా ఉన్న రోజు వారి పాస్ ధర 10QR కు పెంచింది. జర్నీగోల్డ్ క్లాస్ టికెట్ రేటు 10QR నుంచి 15QRకి, 30QRగా ఉన్న గోల్డ్ క్లాస్ ఒక రోజు పాస్ రేటును 45QRకు పెంచారు. ఫిబ్రవరి 21 నుంచి ఈ పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే..మెట్రో కార్డ్స్ రేట్లను మాత్రం పెంచలేదు. మెట్రోలో పేపర్ టికెట్లను తగ్గించే లక్ష్యంతో దోహా మెట్రో ఈ చర్యలు చేపట్టింది. దోహా మెట్రో చేపట్టిన ఈ చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. పేపర్ టికెట్ల రేట్లు పెరిగినప్పటి నుంచి మెట్రో కార్డ్స్ కు డిమాండ్ పెరిగింది. గత వారం రోజులుగా ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది. ఒక్కో వ్యక్తి రెండు, మూడు కార్డులు తీసుకుంటున్నారని దోహా మెట్రో అధికారులు వెల్లడించారు. ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మెట్రో కార్డులు కొంటున్నారని దోహా మెట్రో అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..