కరోనా వైరస్: ఇండియాకి వెళ్ళే యూఏఈ ప్రయాణీకుల సెల్ఫ్ డిక్లరేషన్
- March 04, 2020
దుబాయ్: యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే భారత వలసదారులు, ఇతర ప్రయాణీకులు ఓ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వుంటుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అన్ని ఎయిర్‌లైన్స్‌లు ప్రయాణీకులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లను అందించాలని కోరింది. ఈ ఫామ్లో, ప్రయాణీకులు తమ పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి వుంటుంది. 14 రోజులుగా తాము ఏయే దేశాల్లోని ఏయే ప్రాంతాల్లో పర్యటించిందీ దాంట్లో పేర్కొనాలి. అదే సమయంలో ఇండియాలో ఎక్కడికి వెళుతున్నారు, వారి అడ్రస్, ఫోన్ నెంబర్ వంటివి కూడా ఫామ్లో ప్రస్తావించాల్సి వుంటుంది. దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలపైనా డిక్లరేషన్‌లో ప్రస్తావించాల్సిందే. కాగా, చైనా, హాంగ్‌కాంగ్, సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్ మరియు ఇతర కోవిడ్ 19 ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..