విశాఖలో కరోనా కలకలం
- March 04, 2020
విశాఖపట్నం:విశాఖపట్నంలో కరోనా కలకలం రేపింది. కరోనా వైరస్ లక్షణాలతో ఐదుగురు వ్యక్తులు విశాఖ చాతి ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. కాగా జాయిన్ అయినవారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు. కాగా వీరు ముగ్గురు మలేషియా, సింగపూర్ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించాయన్నారు. అలాగే గాజువాకకు చెందిన ఒక యువతితో పాటు మరొక వ్యక్తికి సౌదీ నుంచి వచ్చిన తర్వాత లక్షణాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. జ్వరం, తీవ్ర జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్న ఐదుగురి నుంచి శాంపిల్స్ సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌కు పంపించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చాతీ ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వీరికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే రిపోర్టులు వచ్చిన తర్వాతే కరోనాపై నిర్దారణకు వస్తామన్నారు.కరోనా వైరస్‌పై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరేట్లో వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. భారత్‌లో ఇప్పటికే 28 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. వారిలో 12మంది భారతీయులుకాగా, 16 మంది విదేశీయులు ఉన్నారు. ఇటలీ నుంచి వచ్చిన 14మంది పర్యాటకులకు కరోనావైరస్ సోకింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!