స్కూళ్ళలో మాస్క్‌లు అవసరం లేదు
- March 05, 2020
మస్కట్: ఒమన్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసుల సంఖ్య 15కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పట్ల భయాందోళనలు పెరుగుతున్నాయి. మరోపక్క, స్కూళ్ళలో విద్యార్థులకు మాస్కులు అవసరం లేదని ఎక్స్పర్ట్ ఒకరు పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - ఇన్ఫెక్షియస్ డిసీజస్ ఎక్స్పర్ట్ మరియు కన్సల్టెంట్ అయిన ప్రొఫెసర్ ఎస్క్లిడ్ పీటర్సన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు తమ డెస్క్‌లను క్లీన్‌గా వుంచుకోవడం అలాగే, ఏదన్నా వస్తువుని తాకిన తర్వాత మళ్ళీ ఆ చేతిని కంటికి లేదా ముక్కుకి తగిలించుకోకుండా వుండడంపై అవగాహన కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్క్‌ల కేంటే పరిశుభ్రతమ చాలా ముఖ్యమని చెప్పారాయన. కేవలం కరోనా వైరస్ బాధితులు మాస్క్‌లు పెట్టుకుంటే సరిపోతుందనీ, జలుబు సహా ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి మాస్క్‌లు అవసరమౌతాయని ఆయన వివరించారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాల పట్ల అవగాహన కలిగ ఇవుండాలని పీటర్సన్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?