జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్నవారికి శుభవార్త...
- March 05, 2020
భారత్ దేశంలో అధిక సంఖ్యలో ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నా పాలసీలు తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. లైఫ్, యాక్సిడెంట్, హెల్త్ ఇలా పలు రకాల పాలసీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనే పేరు వినగానే మొదట మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పేరు గుర్తొస్తుంది.
దేశంలో అతి పెద్ద భీమా సంస్థగా ఎల్ఐసీకు గుర్తింపు ఉంది. మనం LIC ద్వారా 30,000 రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ డబ్బులు పొందవచ్చు. ఈ బీమా కొరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి 30,000 రూపాయల వరకు ఉచిత జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ భీమా అన్ని బ్యాంక్ అకౌంట్లకు వర్తించదు. కేవలం జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి 30,000 రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. పాలసీదారుడు చనిపోతే నామినీకి భీమా డబ్బులు అందుతాయి. గతంలో జన్ ధన్ యోజన అకౌంట్లు ఓపెన్ చేసిన వారు మాత్రమే ఈ భీమా ప్రయోజనాన్ని పొందవచ్చు. 2014 ఆగస్ట్ 15 నుండి 2015 జనవరి 26లోపు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు రూపే కార్డు ఉన్నవారికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. జన్ ధన్ అకౌంట్ తెరిచిన వారు మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి. ఖాతాదారుడు ఎలా మరణించినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







