నిర్భయ దోషులకు ఈనెల 20న ఉరిశిక్ష
- March 05, 2020
ఢిల్లీ:నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు.. నలుగురు దోషులకు ఈనెల 20న ఉరిశిక్ష అమలు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. 20వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నలుగురు నిందితులను ఒకేసారి ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్ పై అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా డెత్ వారెంట్ జారీ చేశారు.
కాగా ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషుల ఉరి వాయిదా పడింది. నిందితులు తమకున్న న్యాయవకాశాలను అన్నింటిని వినియోగించుకున్నారు. అయినా చట్టపరమైన అడ్డంకులతో మరణశిక్ష మూడుసార్లు పోస్ట్ పోన్ అయింది. తాజాగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నాలుగోసారి డెత్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడైనా ఉరి అమలవుతుందా? లేక ఇంకేమైనా అడ్డంకులు వస్తాయా అనే సందేహాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!