కువైట్:సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు

- March 05, 2020 , by Maagulf
కువైట్:సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు

కువైట్:కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ కాకుండా కువైట్ ఇంటిరీయర్ మినిస్ట్రి చర్యలు చేపట్టింది. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. అపోహాలను ప్రచారాం చేయటం ద్వారా దేశ ప్రశాంతతను, భద్రతకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంపై సెక్యూరిటీ అథారిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని, వాట్సాప్ లో ఫేక్ న్యూస్, ఆడియో మెసేజ్ ద్వారా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సర్క్యూలేట్ చేసే వారు లీగల్ యాక్షన్ ఫేస్ చేయాల్స్ ఉంటుందని హెచ్చరించింది. సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యహరించాలని..అనవసర ప్రచారాలను మానుకోవాలని సూచించింది. కరోనా వైరస్ ఎదుర్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చింది.

--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com