యూఏఈ:విదేశాల నుంచి తిరిగొచ్చే వారు ప్రివేంటీవ్ మెజర్స్ ఫేస్ చేయాల్సిందే..

- March 05, 2020 , by Maagulf
యూఏఈ:విదేశాల నుంచి తిరిగొచ్చే వారు ప్రివేంటీవ్ మెజర్స్ ఫేస్ చేయాల్సిందే..

యూఏఈ:పలు దేశాల్లో కోవిడ్-19 వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఫారెన్ పర్యటనలు మానుకోవాలని యూఏఈ తమ రెసిడెన్స్ కి సూచించింది. ఈ మేరకు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తే మళ్లి తిరిగి వచ్చే సమయంలో ప్రివెన్షన్ మెజర్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. రిటర్న్ జర్నీలోనే మెడికల్ చెకప్ చేయించుకోవటంతో పాటు, 14 రోజులు ఇంట్లోనే ఉండాలన్నారు. ఒకవేళ కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ అని తేలితే వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలిస్తామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారితో వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు MoHAP తెలిపింది. ఫ్లైట్స్, షిప్స్, వెహికిల్స్ ఇలా అన్ని మార్గాల్లోనూ  బోర్డర్ క్రాస్ అయ్యే దగ్గర కోవిడ్ -19 టెస్టులు నిర్వహించేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాదు..వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com