చైనా నుంచి ఎమిరేట్స్ హ్యమానిటేరియన్ సిటీకి చేరుకున్న 215 మంది
- March 05, 2020
అబుధాబి: చైనాలోని వుహాన్ సిటీ నుంచి అరబ్ జాతీయుల్ని తరలించే కార్యక్రమాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కో-ఆర్డినేట్ చేసింది.అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీవ్ు కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, చైనాలోని వుహాన్ సిటీ నుంచి అరబ్ జాతీయుల్ని రప్పించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రత్యేక విమానంలో వారందరినీ తరలించారు. అలా వచ్చినవారిని యూఏఈలోని ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీకి తరలించారు. అక్కడ వారికి అవసరమైన వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రత్యేక విమానంలో 215 మందిని తీసుకొచ్చారు. ఇందుకోసం విమానాకి హెచ్ఇపిఎ క్యాబిన్ ఎయిర్ ఫిల్ట్రేషన్స్ సిస్టమ్స్ అమర్చారు. అవసరమైన వైద్య పరికరాల్ని కూడా అందుబాటులో వుంచారు. ఇక, వచ్చినవారికి 14 రోజుల క్వారింటైన్ పీరియడ్ వుంటుంది. కేవలం 48 గంటల్లోనే ఈ సెంటర్‌ని ఏర్పాటు చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..