దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్
- March 05, 2020
దుబాయ్:రెండు దొంగతనం కేసులకు సంబంధించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు దుబాయ్‌లోని ఓ విల్లా నుంచి 8,000 దిర్హాములు దొంగతనం చేశాడు. అయితే, ఇలాంటిదే ఇంకో నేరం చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడు. రెండోసారి దొంగతనం చేస్తున్న సమయంలో మాస్క్ ధరించకపోవడంతో నిందితుడ్ని గుర్తుపట్టడం తేలికయ్యింది. అవకాశం చూసుకుని దొంగతనాలు చేయడం నిందితుడికి అలవాటుగా మారిందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు దొంగతనాలు చేసిన సమయంలో ఒకే తరహా దుస్తుల్ని నిందితుడు ధరించాడు. నిందితుడ్ని పాకిస్తానీ వ్యక్తిగా గుర్తించారు. ఈ కేసు విచారణ మార్చి 22వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..