తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- March 06, 2020
హైదరాబాద్: గంగా- యమున సంగమంగా విరాజిల్లుతూ...లౌకిక వాదానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. మత కలహాలు సృష్టించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు. తొలినాళ్లలో విద్యుత్ కోతలు, నీటి సమస్యలు ఎదుర్కొందని.. అయితే అనతికాలంలోనే వాటిని అధిగమించిందని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు తెలంగాణలో పెన్షన్
ఆసరా పెన్షన్(వృద్యాప్య) వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గింపు
బీడీ కార్మికులకు పెన్షన్ రూ. 2016
దివ్యాంగులకు పెన్షన్ రూ. 3016
కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం
చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం
నాయీ బ్రాహ్మణులు, రజకులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం
గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ
రైతు ఆత్మహత్యలను నివారించాం
రైతులకు నాణ్యమైన, ఉచిత విద్యుత్ అందిస్తున్నాం
కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం
తెలంగాణలో 969 రెసిడెన్షియల్ స్కూళ్లు
ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్ను ఎత్తివేత
మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలను పెంచాం
ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ రూ. 1కే కిలోబియ్య(ఆరు కిలోలు)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







