కరోనా అలర్ట్: అందరికీ ఫేస్ మాస్క్‌లు అవసరంలేదు!
- March 06, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ మోతావా మాట్లాడుతూ, కువైట్‌కి 3 మిలియన్లకు పైగా మాస్క్‌లు ఇటీవల వచ్చాయనీ, అయితే ఫేస్ మాస్క్‌లు అందరికీ అవసరం లేదని, ఎవరికైతే అనుమానిత లక్షణాలు వుంటాయో వారు మాత్రం, మాస్క్‌లు ధరిస్తే సరిపోతుందని చెప్పారు. రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతున్నవారికి వైద్య చికిత్స అందించేవారికి మాస్క్‌ల అవసరం వుంటుందని వివరించారు అల్ ముతావా. అందరూ మాస్క్‌లు ఉపయోగించాలని ఏ ప్రపంచ సంస్థా సూచించడంలేదని ఆయన తెలిపారు. మూడు లేయర్స్ వున్న మాస్క్‌లు వినియోగించడం మంచిదేనని ఆయన సమాధానమిచ్చారు ఓ ప్రశ్నకు స్పందిస్తూ. హ్యుమిడిటీని ఫీలయితే వెంటనే మాస్క్‌ని మార్చాలని, దాన్ని కేవలం వెనుక నుంచి మాత్రమే తీసి, జాగ్రత్తగా పారవేయాలని చెప్పారు అల్ ముతావా.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!