శర్వానంద్,కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో కొత్త సినిమా
- March 06, 2020
శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సుధాకర్ చెరుకూరి సన్నాహాలు చేస్తున్నారు. శర్వానంద్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ఈ కొత్త సినిమాని ప్రకటించారు.
భిన్న కథలతో సినిమాలు చేస్తూ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన శర్వానంద్ ఇప్పుడు కిశోర్ తిరుమలతో ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ చేసేందుకు అంగీకరించారు.శర్వానంద్‌తో తొలిసారిగా పడి పడి లేచే మనసు చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ప్రస్తుతం ఆయన రానా హీరోగా విరాటపర్వం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్‌తో ఆయన నిర్మించ తలపెట్టిన సినిమా నిర్మాతగా ఆయనకు మూడవది.ఎప్పుడు ఈ సినిమా మొదలయ్యేదీ, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







