క్లినిక్‌ నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడు

- March 06, 2020 , by Maagulf
క్లినిక్‌ నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడు

కువైట్‌: కైరవాన్‌ పోలీక్లినిక్‌ నుంచి కరోనా వైరస్‌ అనుమానితుడొకరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన సిబ్బంది వెంటనే మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి సమాచారం అంఇంచారు. పారిపోయిన వ్యక్తిని కువైటీగా గుర్తించారు. ఇటీవలే సదరు వ్యక్తి థాయిలాండ్‌లో పర్యటించాడనీ, ఆ తర్వాత హౌస్‌ క్వారింటీన్‌లో వుంచారనీ తెలుస్తోంది. కరోనా లక్షణాలతో అతను అస్వస్థతకు గురికావడంతో కైరవాన్‌ హెల్త్‌ సెంటర్‌కి తరలించగా, అతన్ని జబెర్‌ హాస్పిటల్‌కి రిఫర్‌ చేశారు. జబెర్‌ హాస్పిటల్‌కి తనను తరలించనున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే అతను పారిపోయినట్లు సమాచారం.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com