ఓన్లీ ఫ్రూట్ డైట్..
- March 07, 2020భారీగా పెరిగి పోతున్న బరువుని చూసి భయపడితే లాభం లేదు. ఏదో ఒకటి చేసి తగ్గాలని రాత్రికి రాత్రి ఆలోచన చేయడం సరికాదు. థైరాయిడ్ సమస్య కావచ్చు, మారిన జీవన సరళి కావచ్చు.. మీ బరువుకి మీరే బాధ్యులు. డైటింగ్ పేరుతో పొట్ట మాడ్చుకోవడం సరికాదు. నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఆహార నియంత్రణతో పాటు, శరీరానికి తగినంత వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. తినే వేళల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరుతిళ్లకు స్వస్తి చెప్పాలి. కూల్ డ్రింకులు, జంక్ ఫుడ్డుకు దూరంగా ఉండాలి. మితంగా భోజనం చేయాలి. పోషకాహార డైట్‌ని తీసుకుంటే మీ శరీరం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఓ వారం రోజుల పాటు ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని కూడా ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించొచ్చని అంటున్నారు డైటీషియన్లు.
మరి అదెలాగో చూద్దాం ఓ సారి.. రోజుకు మూడు పూటలా పండ్లే తీసుకోవాలి. అదే మీ ఆహారం . ఉదయం లేవగానే ఓ లీటర్ గోరు వెచ్చని నీరు తీసుకోవాలి. ఒక్కసారే తాగలేకపోతే మద్యలో ఐదు, పది నిమిషాలు గ్యాప్ తీసుకుని తాగవచ్చు. ఆ తరువాత వ్యాయామం చేసి టిఫిన్ బదులు ఇష్టమైన ఫ్రూట్స్ తినవచ్చు. లేదంటే ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు. ఇక మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం బదులు కేవలం ఫ్రూట్స్‌ని మాత్రమే తీసుకోవాలి. ఫ్రూట్స్ తిన్న గంట తరువాత నీరు తాగాలి. రాత్రి పూట 7గంటలలోపే ఫ్రూట్స్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. ఇలా ఓ వారం రోజులు చేస్తే కచ్చితంగా కొవ్వును కరిగించుకోవచ్చంటున్నారు. ఎందుకైనా మంచిది.. మొదలు పెట్టే ముందు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది గమనించుకోండి. ఓసారి డాక్టర్ని సంప్రదించి స్టార్ట్ చేస్తే మంచిది.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల