అబుధాబి:హద్దు దాటితే స్మార్ట్ గేట్ తో చుక్కలే..మోటరిస్టులకు వార్నింగ్

- March 07, 2020 , by Maagulf
అబుధాబి:హద్దు దాటితే స్మార్ట్ గేట్ తో చుక్కలే..మోటరిస్టులకు వార్నింగ్

అబుధాబి:రోడ్లపై నిబంధనలను పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి కళ్లెం వేసింది అబుధాబి పోలీస్. హైపై స్మార్ట్ సెన్సార్ టవర్ లను ఏర్పాటు చేసింది. ఈ టవర్ కు అమర్చిన కెమెరా ద్వారా ట్రాఫిక్ వయోలేటర్స్ ను గుర్తించి ఫైన్ విధించనున్నారు. ఓవర్ స్పీడుతో వెళ్లేవారు ఓవర్ స్పీడుతో వెళ్లినా..వాహనల ఎక్స్ పైర్ అయినా ఆటోమేటిక్ గా మోటరిస్ట్ కు ఫైన్ పడుతుంది. అందుకే ఓవర్ స్పీడుతో పాటు ట్రాఫిక్ నిబంధనలను ఎవరూ ఉల్లంఘించ వద్దని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే రైట్ సైడ్ పార్కింగ్, ట్రాఫిక్ బ్లాక్ చేసిన మోటరిస్టులను కూడా స్మార్ట్ సెన్సార్ టవర్ ద్వారా గుర్తించవచ్చు. ప్రస్తుతం యూఏఈలో ఏర్పాటు చేసిన ఈ తొలి స్మార్ట్ సెన్సార్ టవర్ ద్వారా వాతావరణ సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ప్రతీకూల వాతావరణ పరిస్థితులలో స్మార్ట్ గేట్ టవర్ ద్వారా ప్రసారం చేసే సందేశాలకు వాహనదారులు కట్టుబడి ఉండాలని, రేడియో స్టేషన్లు, సోషల్ మీడియా ద్వారా అబుధాబి పోలీసులు ప్రసారం చేసిన హెచ్చరికలను అనుసరించాలని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com