రాయలసీమ నేపథ్యంలో 'SR కళ్యాణమండపం - Est. 1975'
- March 07, 2020
'రాజావారు రాణిగారు' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన ఒక చిత్రం రూపొందుతోంది.
ఎలైట్ గ్రూప్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ' SR కళ్యాణమండపం - Est. 1975 ' అనే టైటిల్ ని ఖరారు చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే కథతో ఎంతో ఆసక్తిగా రూపొందుతని, రాయలసీమ నేపథ్యంలో సాగే వినోదాత్మక అంశాలున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు శ్రీధర్ గాదె తెలిపారు. ఇక ఈ సినిమాలో 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర పూర్తి పోషిస్తున్నారు. ఇక తన కెరీర్ లో తొలిసారిగా సాయికుమార్ పూర్తిగా రాయలసీమ మాండలికం, వ్యావహారిక శైలిని అనుసరించనున్నారట, అలానే తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో జరుగుతుందని చిత్ర బృందం చెబుతోంది. మొదటి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ కి 13వ తారీఖు నుంచి రాజంపేటలోని అన్నమాచార్య కాలేజీలో జరగనుందని ఎలైట్ టీమ్ చెబుతోంది.
నటీనటులు : కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, తులసి శివమణి, అరుణ్ కుమార్, అనిల్ జీలా, కష్యప్ శ్రీనివాస్.
టెక్నీషన్స్ : సంగీతం : చేతన్ భరద్వాజ్ , కెమెరామెన్ : విశ్వాస్ డేనియల్.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







