తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు'
- March 08, 2020
దోహా:తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అశోక హాల్, ఇండియన్ కల్చరల్ సెంటర్ ,దోహా లో ఘనంగా జరిగాయి .
ఇండియన్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు AP మణికంఠన్, ఉపాధ్యక్షుడు వినోద్ నాయర్, ఐసీసీ మాజీ అధ్యక్షురాలు మిలన్ అరుణ్, ప్రముఖ సామాజిక మరియు విద్యావేత్త KS ప్రసాద్,ఐసీసీ కాన్సులర్ సర్వీసెస్ హెడ్ ,భూమేష్ పడాల ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమానికి ఖతార్ లో నివసిస్తున్న మన ఇతర రాష్ట్రాల వారినుండి కూడా పెద్ద ఎత్తున మహిళలు హాజరైనట్టు తెలిపారు.
తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశయాల మేరకు ఖతార్ శాఖ తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ తో పాటు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత వంటి అనేక ముఖ్యమైన అంశాల పై కార్యాచరణ చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత పై ప్యానెల్ డిస్కషన్ జరిగింది.ఖతార్ లో ఉంటూ వివిధ రంగాల్లో రాణిస్తున్న మన భారతీయ మహిళలయినటువంటి ఐసిబిఫ్ వెల్ఫేర్ హెడ్ ,రజని మూర్తి ,ఐసీసీ కల్చరల్ హెడ్ నైనా వాఘ్,లయోలా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ షిఫా పర్వేజ్ షేఖ్ ,అప్ప్లస్ వెలాసి మానవ వనరుల డైరక్టర్ సునీత అశోక్ ,ఖతార్ లో ఆహార భద్రత సంస్థ, వాహబ్ యొక్క ఫౌండర్ డైరెక్టర్ వార్థ షాహిద్ ని ఎంపిక చేసి ఈ ప్యానెల్ డిస్కషన్ నిర్వహించినట్టు నందిని అబ్బగౌని గారు తెలిపారు.ఈ సమావేశంలో పానెలిస్టులు మహిళా సాధికారత పై పలు సూచనలు చేశారు, తాము ఎదుర్కొన్న సమస్యలు,సవాళ్లతో పాటు వాటిని ఎలా అధిగమించి విజయం సాధించారో తెలిపారు.
తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న మాట్లాడుతూ,' సంప్రదా ..ఎక్సట్రార్డినారి ఇన్ సారీ' అనే శీర్షిక తో నిర్వహించిన సాంప్రదాయ వస్త్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భారతీయ మగువ ఆత్మ అయినటువంటి చీర యొక్క విశిష్ఠతను తెలుపడానికి, పాశ్చాత్య సంస్కృతి మోజులో నేడు మన చీరకట్టు వెల వెలబోతున్న వేళ చేసిన ఈ ప్రయత్నానికి ఖతార్ లో నివసిస్తున్న భారతీయ మహిళల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు.కేవలం తెలుగు మహిళలే కాకుండా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ ,కేరళ , తమిళ్ నాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాదాపు 30 మంది మహిళలు పాల్గొన్న ఈ ప్రదర్శనకు న్యాయ నిర్ణేతలుగా సుమ మహేష్ గౌడ,ప్రియా భేది,శారదా కల్యాణి వ్యవహరించారు.
తర తరాల నుండి జరుగుతున్న వివక్ష,మహిళలు పడుతున్న కష్టాలు ప్రధాన ఇతివృత్తంగా చేసిన స్కిట్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది అని తెలిపారు.
'అర్ధనారీశ్వరం' కళా ప్రదర్శన తో పాటు,' మేరీ మా',ఆడ పడుచులు చేసిన 'మహిషాసుర మర్ధిని' ,చిన్నారులు చేసిన 'దుర్గా ' సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకొన్నాయని తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..