కరోనా ఎఫెక్ట్:రీఫండ్, ఫ్రీ ట్రావెల్ డేట్ చేంజ్..కరోనాతో యూఏఈ ఎయిర్ లైన్స్ ఆఫర్
- March 08, 2020
దుబాయ్:కరోనా వైరస్ కారణంగా యూఏఈ ఎయిర్ లైన్ సంస్థలు ప్రయాణికులకు వెసులుబాటు కల్పించాయి. ప్రయాణాలను రద్దు చేసుకున్నా, ట్రావెల్ డేట్ ను చేంజ్ చేసుకున్నా పెనాల్టీ చార్జెస్ కట్ చేయబోమని ప్రకటించాయి. టికెట్ రద్దు చేసుకుంటే మొత్తం డబ్బులు రీఫండ్ చేస్తామని వెల్లడించాయి. ట్రావెల్ డేట్ ను మార్చుకున్నా చేంజ్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు. దుబాయ్ బేస్ ఎమిరాతిస్ ఎయిర్ లైన్స్ లో మార్చి 7 నుంచి మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రయాణికులకు వర్తిస్తుంది. అబుదాబి బేస్డ్ ఎతిహాద్ ఎయిర్ లైన్స్ లో జూన్ 30లోపు ట్రావెల్ చేసే వారు తమ ప్రయాణాలను జులై 15కి మార్చుకున్నా చేంజ్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్లై దుబాయ్ కూడా టికెట్ల రద్దు, డేట్ చేంజెస్ పై ఫెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. షార్జా బేస్డ్ ఎయిర్ అరేబియా కూడా పెనాల్టీ చార్జెస్ ఉండబోవని క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాన్, కువైట్ వెళ్లే వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నా, డేట్ చేంజ్ చేసుకున్నా పెనాల్టీ చార్జెస్ ఉండబోవని తమ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..