దర్శక నిర్మాతగా మారిన నటి కల్యాణి..ప్రి లుక్, టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన పూరి జగన్నాథ్
- March 09, 2020
అనేక సూపర్ హిట్ సినిమాల్లో నాయికగా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కల్యాణి తాజాగా దర్శక నిర్మాతగా మారారు. ఇటీవలి కాలంలో అతిథి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న ఆమె కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వాస్తవ ఘటనల ఆధారంగా విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా కల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తయారవుతోంది. ఈ సినిమా ప్రి లుక్, టీజర్ గ్లింప్స్‌ను హోలీ పర్వదినం సందర్భంగా సోమవారం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు.
చేతన్ శీను, సిద్ది, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నది. బాలనటిగా కెరీర్ ఆరంభించిన కల్యాణి, 1986 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. తనకున్న విస్తృతానుభవంతో ఒకవైపు నిర్మాతగా మారుతూనే మరోవైపు దర్శకత్వాన్నీ చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు